మొదటి రోజు మందకొడిగా.. | - | Sakshi
Sakshi News home page

మొదటి రోజు మందకొడిగా..

Jan 29 2026 8:14 AM | Updated on Jan 29 2026 8:14 AM

మొదటి రోజు మందకొడిగా..

మొదటి రోజు మందకొడిగా..

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ/దేవరకద్ర/భూత్పూర్‌: మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ప్రక్రియ తొలిరోజు మందకొడిగా సాగింది. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మొ త్తం 60 డివిజన్లకు గాను బుధవారం 9 నామినేష న్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇందులో బీజేపీ నుంచి నాలుగు, కాంగ్రెస్‌ నుంచి మూడు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. డివిజన్ల వారీగా చూస్తే 12, 22, 23, 32, 49, 53, 57 నుంచి ఒక్కొక్కటి, 42 డివిజన్‌లో రెండు వచ్చాయి. 49వ డివిజన్‌లో కాంగ్రెస్‌ తరఫున మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎ.ఆనంద్‌కుమార్‌గౌడ్‌ సతీమణి ప్రసన్న, 53వ డివిజన్‌లో బీజేపీ తరఫున ఎన్‌.రమేష్‌కుమార్‌, 23వ డివిజన్‌లో మెట్టుకాడి శ్రీనివాసులు, 57వ డివిజన్‌లో ఇండిపెండెంట్‌గా మాజీ కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌ ఉన్నారు. కాగా, ఈ నామినేషన్లకు రెండు రోజులే గడువు ఉన్నందున ఈనెల29, 30వ తేదీల్లో ఎక్కువ సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలున్నాయి.

● దేవరకద్ర మున్సిపాలిటీలో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 3వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కాటం అనిత, బీజేపీ నుంచి పృథ్వీ, 4వ వార్డు నుంచి పిట్టల ఉమా , 7వ వార్డు నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా జెట్రం బీరప్ప నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా.. మున్సిపాలిటీలో 12 వార్డులకు ఐదు నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద ఎస్‌ఐ నాగన్న ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ నరేష్‌బాబు, అధికారి సీత్యానాయక్‌ పర్యవేక్షణ నిర్వహించారు.

● భూత్పూర్‌ మున్సిపాలిటీలో ఎరుకలి ముత్తయ్య స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేశారు. మున్సిపాలిటీలో 10 వార్డులకు 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాగా.. పోటీలో ఉన్న ఆశావహులు ఇంటిపన్ను, నీటి పన్ను చెల్లించడంతో పాటు నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ఎగబడ్డారు. బుధవారం ఒక్కరోజే మున్సిపాలిటీకి రూ.3లక్షల ఆదాయం వచ్చింది.

14 నామినేషన్లు దాఖలు

మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో 8 డివిజన్లకు

9 నామినేషన్లు..

ఇంకా రెండురోజులు మాత్రమే గడువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement