మున్సిపాలిటీల్లో చెక్ పవర్ కమిషనర్లదే..!
పాలమూరు: ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విధులు ఎంత కీలకంగా ఉంటయో అదే స్థాయిలో కమిషనర్‌కు రెట్టింపు అధికారులు ఉంటాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చెక్‌పవర్ కమిషనర్‌కు మాత్రమే వర్తిసుంది. వ్యక్తులు లేదా సంస్థలకు చెక్కులు ఇవ్వాలంటే ఎందుకు చెల్లింపులు జరపాలని ముందుగా గుర్తించాలి. ఉదాహరణకు ఏదైనా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో రూ.లక్షతో సామగ్రి కొనుగోలు లేదా అభివృద్ధి పనులు చేపట్టిన బిల్లులను సంబంధిత విభాగానికి చెందిన ఉద్యోగి.. కమిషనర్‌కు సమర్పించాలి. వాటి వివరాలను కమిషనర్ సరి చూసుకోవాలి. వీటిని కమిషనర్ ధ్రువీకరిస్తూ పాలకవర్గ(కౌన్సిల్) అనుమతి పొందాలి. అందుకు సంబంధించిన ఫైల్‌పై మున్సిపల్ చైర్మన్ లేదా చైర్‌పర్సన్ లేదా కార్పొరేషన్ మేయర్ సంతకం తీసుకోవాలి. అనంతరం ఆయా వివరాలు క్యాష్‌బుక్‌లో నమోదయ్యాక కమిషనర్ చెక్కు జారీ చేస్తారు. చెక్కు వివరాలు ఏ వ్యక్తికి ఎందుకిస్తున్నారో క్యాష్ బుక్‌లో నమోదు చేసే బాధ్యతను సదరు కమిషనర్, అకౌంటెంట్ చూసుకోవాలి. ఒకవేళ పాలకవర్గ గడువు ముగిస్తే ప్రత్యేకాధికారి అనుమతి తీసుకొని చెక్కులు జారీ చేస్తారు. దీనిలో ఏ నిబంధనను ఉల్లంఘించినా నేరంగా పరిగణిస్తారు. ఉద్దేశపూర్వకంగా నకిలీ బిల్లులు, తప్పుడు సమాచారంతో చెక్కులు జారీచేస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలతో పాటు క్రిమినల్ కేసులు పెట్టి సొమ్మును స్వాధీన చేసుకునే ఆస్కారముంది.


