మహాత్ముడి విగ్రహానికి నిమజ్జనం
త్వరలో ఏర్పాటు చేస్తాం..
నవాబుపేట: ఏళ్ల తరబడి చెట్టు కింద శిథిలమైన ఉన్న మహాత్ముడి విగ్రహానికి విముక్తి కలిగింది. గాంధీజీ విగ్రాహానికి ప్రతిష్ఠించేందుకు తీసుకొచ్చి మూఢ నమ్మకాలతో వదిలేయడంతో దాదాపు 40 ఏళ్లుగా చె ట్టు కిందనే ఉండి శిథిలావస్థకు చేరింది. ఈ క్రమంలో బుధవారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాచారి ఆధ్వర్యంలో గ్రామస్తులు పూజలు చేసి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.ఎక్కడ లేని విధంగా విగ్ర హానికి నిమజ్జనం చేయటం ప్రత్యేకంగా నిలిచింది.
మూఢ నమ్మకాలతో..
1985 సంవత్సరంలో మండల పరిధిలోని గురు కుంటలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చే సేందుకు ఉపాధ్యాయులు, గ్రామస్తులు పూనుకున్నారు. ఈ క్రమంలో విగ్రహాన్ని తీసుకొచ్చిన ఉపాఽ ద్యాయుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కీడు శంకించిన గ్రామస్తులు అక్కడి నుంచి విగ్రహాన్ని మండల పరిధిలోని పోమాల్ గ్రామానికి తరలించారు. అక్కడ విగ్రహ ఏర్పాటు కు సన్నహాలు చేస్తున్న తరుణంలో గ్రామపెద్ద సైతం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్డా డు. ఈ క్రమంలో వారు 35 ఏళ్ల క్రితం నవాబుపేట మండల కేంద్రానికి తీసుకొచ్చారు. అనంతరం ప్రతిష్ఠించేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో విగ్రహం పెట్టిన చోటే శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో శిథిల విగ్రహాన్ని ఏం చేయాలన్న దానిపై గ్రామస్తుల్లో తర్జనభర్జన మొదలైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎట్టకేలకు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాచారి ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం నిమజ్జనం చేశారు.
మూఢ నమ్మకాలతోనే గాంధీజీ విగ్రహాన్ని వదిలేయటంతో అది కాస్తా శిథిలమైంది. నిబంధనల ప్రకారం విగ్రహాన్ని నిమజ్జనం చేశాం. తాజాగా అంబేడ్కర్ చౌరాస్తాలో విగ్రహ ఏర్పాటుకు స్థలం పరిశీలించాం. త్వరలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.
– నర్సింహాచారి,
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్
మహాత్ముడి విగ్రహానికి నిమజ్జనం


