ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి

Jan 23 2026 9:17 AM | Updated on Jan 23 2026 9:17 AM

ట్రాఫ

ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి

సమయానికి వెళ్లలేకపోతున్నా..

కొన్నేళ్లుగా నగరంలోని లక్ష్మీనగర్‌ కాలనీలో బిల్డింగ్‌ ప్లానర్‌గా పనిచేస్తున్నా. మర్లులోని మా ఇంటి నుంచి ఉదయం అక్కడికి చేరు కోవాలంటే అరగంటపైనే పడుతోంది. రోడ్డు మీదకు బైక్‌పై రావాలంటేనే రద్దీగా ఉంటోంది. ఎన్‌హెచ్‌ –167పై ఎప్పుడూ కిక్కిరిసిన ట్రాఫిక్‌తో నిండి ప ద్మవ్యూహాన్ని తలపిస్తుంది. తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకోవాలన్నా అదే పరిస్థితి. ముఖ్య కూడళ్ల లో అన్నిచోట్ల ట్రాఫిక్‌ పోలీసులను నియమించాలి.

– మహమ్మద్‌ ఆసిఫ్‌, మర్లు, మహబూబ్‌నగర్‌

బోయపల్లి గేట్‌ వద్ద..

రైళ్ల రాకపోకల కారణంగా తరుచుగా బోయపల్లి గేట్‌ మూసివేస్తున్నారు. దీంతో అటు, ఇటువైపు కిలోమీటరు వరకు వాహనాలు ఆగిపోతున్నాయి. రైలు వెళ్లిపోయాక గేటు తెరిచినా ట్రాఫిక్‌ నుంచి బయటపడాలంటే 15 నిమిషాలు అవుతోంది. ఈ ప్రాంతంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మించాలి. అప్పుడే ఈ సమస్య కొంత వరకు పరిష్కారమవుతుంది. నగరంలోకి పనిమీద బైక్‌పై వచ్చి తిరిగి వెళ్లాలంటేనే గంటల తరబడి మధ్య మధ్యలో ఆగాల్సి వస్తోంది.

– కిశోర్‌కుమార్‌, కల్వరికొండ, నవాబుపేట రోడ్‌,

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికలు వాపోతున్నారు. కొందరు పుట్‌బోర్డులు ఆక్రమించి వాహనాలు నిలపడం, చిరువ్యాపారాల వంటివి చేస్తుండటంతో పాదచారులు ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో సమస్యకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశంపై గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘స్థలాలు లేక.. పార్కింగ్‌కు బేజారు’ కథనం బాగుందని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన వారు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను కోరుతున్నారు.

వన్‌టౌన్‌ వద్ద రద్దీనే..

వివిధ పనుల నిమిత్తం నగరంలోకి బైక్‌పై రావాలంటే చాలా సమ యం తీసుకుంటోంది. ముఖ్యంగా వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ చౌరస్తాలో ఎప్పుడూ వాహనాల రద్దీ కనిపిస్తుంది. ఇక కొత్త బస్టాండ్‌ వద్ద అయితే అడ్డంగా ఆటోలు ఆగి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ఉన్నా వాటిని నియంత్రిచడం లేదు. దీంతో తరచూ ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ బాగా చీకటి అవుతుంది. – రవిప్రకాష్‌, భగీరథకాలనీ, మహబూబ్‌నగర్‌

ఎక్కడ బడితే అక్కడ

వాహనాల నిలిపివేత

పుట్‌బోర్డులను ఆక్రమించడంతో పాదచారుల ఇక్కట్లు

సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకోలు

ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి1
1/5

ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి

ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి2
2/5

ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి

ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి3
3/5

ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి

ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి4
4/5

ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి

ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి5
5/5

ట్రాఫిక్‌పై దృష్టిపెట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement