తొలి పురపాలికం | - | Sakshi
Sakshi News home page

తొలి పురపాలికం

Jan 29 2026 8:17 AM | Updated on Jan 29 2026 8:17 AM

తొలి

తొలి పురపాలికం

1952లో 24 వార్డులతో ఆవిర్భావం

జనరేటర్‌తో విద్యుత్‌ తయారీ

పాలమూరులో
నారాయణపేట మున్సిపాలిటీకి 81 ఏళ్లు

నాడు మీర్‌ మజ్లిద్‌

బల్దియా.. నేడు గ్రేడ్‌–2 మున్సిపాలిటీ

తొలి చైర్మన్‌గా

రామచందర్‌రావు

కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు.. బీజేపీ నుంచి నలుగురు చైర్మన్లు

బీఆర్‌ఎస్‌కు ఒక్కసారే దక్కిన అవకాశం

నారాయణపేట పట్టణ వ్యూ

నారాయణపేట: నిజాంపాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీగా 81 ఏళ్ల క్రితం నారాయణపేట 1945–46లో ఆవిర్భవించింది. అప్పట్లో మీర్‌ మజ్లిద్‌ బల్దియాగా నామకరణం చేశారు. మున్సిపల్‌ అండ్‌ కమిటీల చట్టం 1961 కింద 1962లో మొట్టమొదటిసారిగా వయోజన ఓటుహక్కు ప్రతిపాదికన ఎన్నికలు జరిగాయి. వాటిలో మూడు స్థానాలు నామినేటెడ్‌ సభ్యులతో భర్తీ చేసేవారు. తొలి చైర్మన్‌గా రామచందర్‌రావు కల్యాణి ఎన్నికయ్యారు. ఆ తర్వాతో 1962లో మక్తల్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది తొలి మంత్రిగా చరిత్రలో నిలిచారు.

పదవీకాలం పార్టీ చైర్మన్‌

1954–59 కాంగ్రెస్‌ రాంచందర్‌రావు కల్యాణి

1961–66 కాంగ్రెస్‌ మల్లయ్య

1966–66 కాంగ్రెస్‌ దత్తాత్త్రేయ కల్యాణి

1967–72 కాంగ్రెస్‌ సాయిబన్న

1981–86 కాంగ్రెస్‌ సీతారామారావు

1989–94 బీజేపీ లలితాబాయి

1995–99 కాంగ్రెస్‌ సత్యమ్మ

2000–02 బీజేపీ సాయిబన్న

2002–03 టీడీపీ అరవింద్‌కుమార్‌గౌడ్‌

2003–05 బీజేపీ రాంచందర్‌ సాఖరే

2005–10 కాంగ్రెస్‌ శశికళ

2010–13 ప్రత్యేకాధికారి పాలన

2014–19 బీజేపీ గందె అనసూయ

(2017లో బీఆర్‌ఎస్‌లోకి..)

2020–25 బీఆర్‌ఎస్‌ గందె అనసూయ

(2024లో కాంగ్రెస్‌లోకి..)

2025–26 ప్రత్యేక అధికారి పాలన

నిజాం కాలంలోనే నారాయణపేటలో విద్యుత్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక జనరేటర్‌ సదుపాయంతో నీటి హౌజ్‌ను కట్టి అందులోంచి కరెంట్‌ ఉత్పత్తి చేసే పద్ధతిని కనుగొన్నారు. ఒక ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి పట్టణంలో వీధిదీపాలు, ఇళ్లకు వెలుగులు నింపిన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఆ జన రేటర్‌ శ్రీశైలం పవర్‌ ప్రాజెక్టులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

1952లో కౌన్సిల్‌ స్థానాలు 24 ఉండేవి. అప్పటి నుంచి తగ్గుతూ... పెరుగుతూ వార్డు స్థానాలు 2020లో మళ్లీ 24 వార్డులయ్యాయిఅయ్యాయి. 1956 హైదరాబాద్‌ జిల్లా మున్సిపాలిటీ చట్టం కింద 1961లో రెండోసారి ఎన్నికల జరగగా కౌన్సిల్‌ స్థానాలను 17కు కుదించారు. వీటిలో ఒక సీటు షెడ్యూల్డ్‌ కులాలకు కేటాయించారు. 1965లో ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీ చట్టం కింద కౌన్సిల్‌ స్థానాలు 20కి పెంచారు. ఇందులో రెండు సీట్లు మహిళలకు, రెండు సీట్లు షెడ్యూల్డ్‌ కులాలకు కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్‌ ఆఫీషియో సభ్యుడిగా వ్యవహరించే వారు. ఒక కో–ఆప్షన్‌ సభ్యుడిని ఎన్నుకునే అధికారం కౌన్సిల్‌ పొందింది. 1994లో నారాయణపేట మున్సిపాలిటీ నగర పంచాయతీగా మారింది. కౌన్సిలర్‌ వార్డు స్థానాలు 20 కొనసాగాయి. 2004లో దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి చొరవతో నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చారు. కౌన్సిలర్‌, వార్డు స్థానాలు 23కు పెరిగాయి. వార్డుల పునర్విభజనతో 23 వార్డులకు గాను ఒక వార్డు పెరగడంతో 2020లో 24 వార్డులకు మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 2026లో సైతం 24 వార్డులతో ఎన్నికలు

జరగనున్నాయి.

రాష్ట్రంలో హైదరాబాద్‌ బల్జియాను మినహాయిస్తే నారాయణపేట మొట్టమొదటి మున్సిపాలిటీగా 1945–48 మూడో శ్రేణిగా అర్హత సాధించింది. నైజాం హయాం నుంచి గ్రేడ్‌–3గా ఉన్న మున్సిపాలిటీ 2014లో బీజేపీ నుంచి గెలుపొందిన గందె అనసూయ అప్పటి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 2017లో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరడంతో గ్రేడ్‌–2 మున్సిపాలిటీగా ప్రకటించారు.

మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా ఏడుగురు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు, నలుగురు బీజేపీకి చెందిన వారు చైర్మన్లు అయ్యారు. గడ్డం సాయిబన్న గుండెపోటుతో మరణించడంతో ఆరు నెలలపాటు వైస్‌ చైర్మన్‌ అరవింద్‌కుమార్‌గౌడ్‌ ఇన్‌చార్జి చైర్మన్‌గా ఉన్నారు. 2020లో బీఆర్‌ఎస్‌కు చెందిన గందె అనసూయ చైర్‌పర్సన్‌ అయ్యారు.

నారాయణపేట మున్సిపల్‌ కార్యాలయం

తొలి పురపాలికం 
1
1/4

తొలి పురపాలికం

తొలి పురపాలికం 
2
2/4

తొలి పురపాలికం

తొలి పురపాలికం 
3
3/4

తొలి పురపాలికం

తొలి పురపాలికం 
4
4/4

తొలి పురపాలికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement