నిలకడగా ఉల్లి ధరలు
గందె అనసూయ
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్‌కు బుధవారం దాదాపు రెండు వేల బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. వేలం ప్రారంభమైన తర్వాత ధరలు నిలకడగా కొనసాగాయి. నాణ్యంగా ఉన్న తెల్ల ఉల్లి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.1800 పలికింది. రెండో రకం ఎర్రఉల్లి కనిష్టంగా రూ. 1000 వరకు పలికింది. అలాగే 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ.900, కనిష్టంగా రూ.500 వరకు పలికింది. వేలం పాటకు స్థానిక వ్యాపారులతో పాటు ఇతర మార్కెట్‌ల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున వచ్చిన ధరలు పెరగలేదు. ఉల్లి తూకం తరువాత వ్యాపారం జోరుగా సాగింది.


