సంస్కరణలతో రైతులు, పేదలకు ప్రయోజనం
జడ్చర్ల టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం విశిష్టత, నూతన సంస్కరణల అనంతరం రైతుకూలీలు, పేదలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం మండలంలోని గోప్లాపూర్, లింగంపేట, రామస్వామిగుట్టతండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండా, గద్దెను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో పథకంలో అనేక లొసుగులు ఉండటంతో అక్రమాలు జరిగేవని, మోడీ సర్కారు తీసుకొచ్చిన మార్పులతో అవినీతికి తావులేకుండా పోయిందన్నారు. వ్యవసాయ పనులకు ఇబ్బందులు లేకుండా పథకం రూపొందించబడిందని వివరించారు. పనులు చేసిన తర్వాత 15రోజుల్లోగా కూలీలకు వేతనాలు చెల్లించాలనే నిబంధనతో పారదర్శకత తీసుకొచ్చామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీ రామ్ జీ పథకంపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో అపోహలు సృష్టిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకురాలు పద్మజారెడ్డి, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాలవర్ధన్‌గౌడ్, నర్సింహులు, మండలాధ్యక్షుడు రామకృష్ణ, రమేశ్‌జీ, గణపతి, శ్రీశైలం ముదిరాజ్, మోహన్‌నాయక్, మురళి పాల్గొన్నారు.


