కాంగ్రెస్‌ పార్టీతోనేఅభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీతోనేఅభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

Feb 3 2026 7:51 AM | Updated on Feb 3 2026 7:51 AM

కాంగ్

కాంగ్రెస్‌ పార్టీతోనేఅభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మెట్టుగడ్డలోని సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం కార్యాలయంలో నిర్వహించిన ఉజ్వల విశ్రాంత మహిళా ఉపాధ్యాయ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ అభివృద్ధి కోసం రూ.రెండు వేల కోట్లతో వివిధ పనులకు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే నగర అభివృద్ధికి రూ.150 కోట్లు వెచ్చించామన్నారు. అంతకుముందు విశ్రాంత మహిళా ఉపాధ్యాయ ఫోరం కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా విశ్వరూప, కో–కన్వీనర్‌గా పుష్పలత, కార్యదర్శిగా సావిత్రి, కోశాధికారిగా జయంతి, సలహాదారుగా పీజే డెబోర, కార్యవర్గ సభ్యురాలిగా షాహిన్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, ఎస్‌.వినోద్‌కుమార్‌, గట్టు వెంకట్‌రెడ్డి, సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు పాల్గొన్నారు.

పరీక్షలను పరిశీలించిన పీయూ రిజిస్ట్రార్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: పాలమూరు యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలనుయూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొ. రమేశ్‌బాబు సోమవారం పరిశీలించారు. అలాగే పీజీ రెండో సంవత్సరం మూడో సెమిస్టర్‌ పరీక్షలను పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.మధుసూదన్‌రెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.చంద్రకిరణ్‌, హెచ్‌ఓడీ డా.పండుగ రామరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మహిళా జట్టు శుభారంభం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: వరంగల్‌లో సోమవారం ప్రారంభమైన సీనియర్‌ ఉమెన్స్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టీ–20 టోర్నమెంట్‌లో ఉమ్మడి జిల్లా మహిళా జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 10 వికెట్ల తేడాతో కరీంనగర్‌ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కరీంనగర్‌ జట్టు మహబూబ్‌నగర్‌ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. మహబూబ్‌నగర్‌ బౌలర్లు అనిత 3 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, ప్రవళిక కాట్రావత్‌ 4 ఓవర్లలో 2 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్‌ మహిళల జట్టు 4.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. జట్టులో ఆర్యని 14, అక్షర రాథోడ్‌ 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

కాంగ్రెస్‌ పార్టీతోనేఅభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే 
1
1/2

కాంగ్రెస్‌ పార్టీతోనేఅభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

కాంగ్రెస్‌ పార్టీతోనేఅభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే 
2
2/2

కాంగ్రెస్‌ పార్టీతోనేఅభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement