స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర | - | Sakshi
Sakshi News home page

స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర

Jan 22 2026 7:37 AM | Updated on Jan 22 2026 7:43 AM

స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర

స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర

గరిష్టంగా రూ.1,900.. కనిష్టంగా రూ.800

దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం ఉల్లి ధరలు స్వల్పంగా తగ్గాయి. రెండు వారాల కిందట కాస్త పెరిగినా.. గత వారం సంక్రాంతి సందర్బంగా వేలం నిర్వహించలేదు. బుధవారం ఉదయం మార్కెట్‌కు సుమారు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. వ్యాపారులు వేలం వేసి కొనుగోలు చేశారు. నాణ్యమైన ఉల్లి కొనుగోలుకు పోటీ పడ్డారు. మొదటి రకం ఉల్లి క్వింటా గరిష్టంగా రూ.1,900, నాణ్యత తక్కువగా ఉన్న ఉల్లి రూ.1,800 వరకు పలికింది. ఎర్ర ఉల్లి గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ.800 ధర లభించాయి. వేలం తర్వాత 50 కిలోల బస్తా రూ.900 నుంచి రూ.950 వరకు, ఎర్ర ఉల్లి బస్తా రూ.400 నుంచి రూ.659 వరకు విక్రయించారు.

మార్కెట్‌లో ఉల్లి కుప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement