150 గ్రాముల గంజాయి సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

150 గ్రాముల గంజాయి సీజ్‌

Jan 25 2026 7:27 AM | Updated on Jan 25 2026 7:27 AM

150 గ

150 గ్రాముల గంజాయి సీజ్‌

మహబూబ్‌నగర్‌ క్రైం: కోయిల్‌కొండలో ఎకై ్సజ్‌ అధికారులు చేపట్టిన తనిఖీలో గంజాయి విక్రయిస్తూ ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఎస్‌ఐ కరుణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కోయిల్‌కొండ మండల కేంద్రంలోని ఆటో స్టాండ్‌ వద్ద చేసిన తనిఖీల్లో శ్రీకాంత్‌, కేశవులు అనే ఇద్దరు వ్యక్తులు చిన్న చిన్న పాకెట్లలో గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద 150 గ్రాముల ఎండు గంజాయి, సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజాయి విక్రయాలపై 87126 58872కు సమాచారం ఇవ్వాలని సీఐ వీరారెడ్డి తెలిపారు.

జాతీయ స్థాయి సైన్స్‌ ప్రదర్శనకు

బల్మూర్‌ విద్యార్థి

బల్మూర్‌: మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి కిరణ్‌సాగర్‌ జాతీయ స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై నట్లు జీహెచ్‌ఎం నరేందర్‌రెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు సంగారెడ్డిలో జరిగిన దక్షణ భారత సైన్స్‌ ఫెయిర్‌లో ఎలాంటి బ్యాటరీ, ఆయిల్‌ లేకుండా సోలార్‌తో నడిచే కలుపుతీత యంత్రాన్ని ప్రదర్శించి ప్రతిభ చాటడంతో జాతీక స్థాయి ప్రదర్శనకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. కాగా జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థితో పాటు గైడ్‌ టీచర్‌ను ఉపాధ్యాయులు అభినందించారు.

ఇద్దరు యువకుల అరెస్టు

150 గ్రాముల  గంజాయి సీజ్‌ 
1
1/1

150 గ్రాముల గంజాయి సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement