కమనీయం లక్ష్మీచెన్నకేశవుడి కల్యాణం
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి కల్యాణం గురువారం ఆలయ ప్రాంగణంలోని కృష్ణ మండపంలో వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు కాళ్ల మంటపం వద్ద ఎదుర్కోలు వేడుక నిర్వహించి ఊరేగింపుగా ఆలయంలోని కృష్ణ మండపానికి తీసుకొచ్చారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణం జరిపించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వేడుకల్లో ఆలయ కార్య నిర్వహణాధికారి దీప్తిరెడ్డి, సర్పంచ్ గిరి, భక్తులు పాల్గొన్నారు.


