బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
పాలమూరు: మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో పోటీ చేసే ప్రతి బీజేపీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా డివిజన్‌లలో పని చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ కార్పొరేటర్ల అభ్యర్థులతో సోమవారం ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు రావడం ఇదే సమయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలోని పాలమూరు జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశం కావడం అధిక సంఖ్యలో తరలిరావాలని, సభా స్థలానికి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చేరుకోవాలన్నారు. సాధారణ పబ్లిక్ మీటింగ్ కాదని, పార్టీ జెండా మోసే బీజేపీ కార్యకర్తల సమావేశం కావడం వల్ల నాయకులు అధికంగా రావాలన్నారు. నగరం మొత్తం బీజేపీ బ్యానర్లు, కమలం జెండాలతో అలంకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎన్నికల ఇన్‌చార్జి చింతల రామచంద్రారెడ్డి, పద్మజారెడ్డి, నాగురావు నామాజీ, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రతంగ్‌పాండురంగారెడ్డి, దిలీపాచారి, శ్రీనివాస్‌రెడ్డి, రమేష్‌కుమార్, నాయకులు బాలరాజు, కృష్ణవర్ధన్‌రెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.
● ఈ నెల 4న నగరంలో ఎంవీఎస్ మైదానంలో బీజేపీ ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను సోమవారం సాయంత్రం రామచందర్‌రావుతో పాటు మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలర్‌తో కలిసి పరిశీలించారు. మధ్యాహ్నం నుంచి మొదలు కానున్న సమావేశంలో ఎలాంటి లోపాలు, ఇబ్బందులు రాకుండా కచ్చితమైన ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటన ఏర్పాట్ల పరిశీలన


