హంస వాహనంపై నారసింహుడు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం రాత్రి హంసవాహన సేవ నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మేళతాళాలతో ఆలయ సమీపంలోని శ్రీవారి సముద్రంలో హంస వాహనంపై ఉంచి విహరించారు. భక్తుల జయజయ ధ్వానాల నడుమ స్వామివారి హంసవాహన సేవ కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయని వేదపండితులు తెలిపారు. సుమారు నెల రోజులు జాతర కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఆదిత్య లక్ష్మణ్‌రావు, సర్పంచ్ యాదన్నగౌడ్, ఉపసర్పంచ్ సాయికృష్ణగౌడ్ పాల్గొన్నారు.


