ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా
నగరంలో ఉన్న ఇతర డివిజన్‌ల కంటే 45వ డివిజన్‌ను పూర్తిగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. బీటెక్ పూర్తి చేశా. ఐదేళ్లుగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల మధ్య విజేతగా నిలిచా. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ప్రధానంగా మజీద్‌లు, అన్నిరకాల ఆలయాలు, చర్చ్‌ల వద్ద సీసీ కెమెరా లు ఏర్పాటు చేయడం, డివిజన్‌లో పారిశుద్ధ్య సమస్యలు తొలగించడం, విద్యుద్దీపాలు, రోడ్లు ఏర్పాటు చేయడం వంటి వాటిపై దృష్టి పెడుతా.
– సల్మాన్ షరీఫ్, 45వ డివిజన్ కార్పొరేటర్


