జాతీయస్థాయి క్యారమ్స్‌కు ప్రియాంక
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ (ఏఐసీఎస్) స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా టీఎన్జీఓస్ తరఫున యూనియన్ నాయకురాలు ప్రియాంక హాజరయ్యారు. క్రీడాంశాల్లో ప్రియాంక, అనిల్ క్యారమ్స్ పోటీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ డాక్టర్ జి.రాజీవ్‌రెడ్డితో పాటు టీఎన్‌జీఓ యూనియన్ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ మీట్ పేరిట పోటీలు నిర్వహిస్తారన్నారు. భవిష్యత్తులో మరెన్నో క్రీడాంశాల్లో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, కోశాధికారి డాక్టర్ కృష్ణమోహన్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు ప్రియాంకను అభినందించారు.


