అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం

Feb 17 2026 8:42 AM | Updated on Feb 17 2026 8:42 AM

అన్ని

అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ:అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం

స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ నుంచి మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయి ఏడాది దాటింది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సూచనలు, సలహాలతో అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. మొదటిసారి డిప్యూటీ మేయర్‌గా అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటికే పెద్ద ఎత్తున మంజూరైన నిధులతో నగరంలో నెలకొన్న సమస్యలను మేయర్‌ గుమాల మమతతో కలిసి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. వీధి దీపాల ఏర్పాటుతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను, తాగునీటి సరఫరాను మెరుగు పరచడమే గాక ఎక్కడెక్కడ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ బాగాలేవో పరిశీలిస్తాం. ముఖ్యంగా విలీన గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తాం. మొత్తంమీద నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.

– మారేపల్లి సురేందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌

అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం 1
1/1

అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement