పకడ్బందీగా ఎస్‌ఐఆర్ మ్యాపింగ్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇందుకుగాను గ్రామ పాలన అధికారులు, ఇతర అధికారులను సహాయకులుగా నియమించాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి తరఫున బూత్ స్థాయి ఏజెంట్లను నియమించేలా అవగాహన కల్పించాలన్నారు. అధికారుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో కలెక్టర్ విజయేందిర బోయి, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్, మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ ఘాన్సీరాం తదితరులు పాల్గొన్నారు.


