విద్యార్థిపై యువకుల దాడి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిపై యువకుల దాడి

Feb 18 2026 8:06 AM | Updated on Feb 18 2026 8:06 AM

విద్యార్థిపై యువకుల దాడి

విద్యార్థిపై యువకుల దాడి

కొత్తకోట రూరల్‌: పదో తరగతి విద్యార్థిపై యువకులు దాడి చేసిన ఘటన మండలంలోని కానాయపల్లి గ్రామ శివారులోని కోటిలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపిన వివరాలు.. కొత్తకోటకు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ దుప్పల్లి వెంకటేష్‌ చిన్న కుమారుడు భానుప్రకాష్‌ పదో తరగతి చదువుతున్నాడు. శివరాత్రి సందర్భంగా కానాయపల్లి గ్రామ శివారులోని కోటిలింగేశ్వరస్వామి ఆలయానికి జాగారణ చేసేందుకు ఈ నెల 15న వెళ్లాడు. సుమారు రాత్రి 11:30 సమయంలో గుడి నుంచి బయటకు టీ తాగేందుకు స్నేహితులతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో టీ షాపు వద్ద పార్క్‌ చేసిన బైక్‌పై కూర్చున్నాడు. బైక్‌ను అక్కడి నుంచి తీయాలంటూ కానాయపల్లి గ్రామానికి చెందిన దాసరి నాని, అతని అన్న దాసరి బాలరాజు, వారి స్నేహితులు చెప్పడంతో బైక్‌ నాది కాదని భానుప్రకాష్‌ చెప్పిన వినకుండా సదరు యువకులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం మేరకు అక్కడికి భానుప్రకాష్‌ తండ్రి దుప్పల్లి వెంకటేష్‌ కుమారుడిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌ ఎస్‌వీఎస్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భానుప్రకాష్‌ పరిస్థితి విషయమంగా ఉందని వైద్యులు పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

పరిస్థితి విషమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement