‘కురుమూర్తి’ భక్త జనసంద్రం
రాజగోపురం వద్ద దీపాలు వెలిగిస్తున్న భక్తులు
చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి ఆలయం అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు అధికంగా రావడంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్నారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, వ్రతాలు, అభిషేకాలు నిర్వహించారు. కొందరు భక్తులు కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించారు. కొండపైన స్వామివారితోపాటు అలివేలుమంగమ్మ అమ్మవారు, చెన్నేశవస్వామి, ఆంజనేయ స్వామి ఉద్దాల మండపం, స్వామివారి పాదుకలను దర్శించుకున్నారు. రాజగోపురం వద్ద దీపాలు వెలిగించి వేడుకున్నారు. కురుమూర్తి కొండపైన, జాతర మైదానంలో భక్తల రద్దీ కనిపించింది. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.
స్వామివారి పాదుకల వద్ద ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు
‘కురుమూర్తి’ భక్త జనసంద్రం
‘కురుమూర్తి’ భక్త జనసంద్రం


