జోగుళాంబ హాల్ట్‌కు హంగులు | - | Sakshi
Sakshi News home page

జోగుళాంబ హాల్ట్‌కు హంగులు

Feb 18 2026 8:06 AM | Updated on Feb 18 2026 8:06 AM

జోగుళ

జోగుళాంబ హాల్ట్‌కు హంగులు

ఉండవెల్లి: ఐదో శక్తిపీఠం అలంపూర్‌లో జోగుళాంబ ఆలయానికి వెళ్లే భక్తులకు అనుసంధానంగా ఉన్న జోగుళాంబ రైల్వేస్టేషన్‌ రూపు రేఖలు మారాయి. రైల్వే అధికారులు నూతన హంగులతో ఆలయం ఇక్కడేనా అన్నట్లుగా మార్చేశారు అధికారులు. హైలెవల్‌ ఫ్లాట్‌ఫాంను వృద్ధులకు, దివ్యాంగులు, చిన్నారులకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. అమ్మవారి తొమ్మిది అవతారలను ఆలయానికి వెళ్లే మార్గంలో రైల్వేస్టేషన్‌ గోడలపై ప్రతిబింబించేలా ఏర్పాటు చేయడంతో భక్తులు, ప్రయాణికులు పరవశించి పోతున్నారు.

ఆలయ ఆకారంలో టికెట్‌ రూం

ఆలయంలో ఉన్న అమ్మవారి అవతార రూపాలను స్టేషన్‌ గోడలపై ఏర్పాటు చేశారు. టికెట్‌ గది బయట మొత్తం ఆలయం లోపలికి వెళ్లే మార్గంలా నూతన హంగులతో నిర్మించారు. ఇది రైల్వేస్టేషనా.. లేక ఆలయమా అంటూ ప్రయాణికులు పులకించిపోతున్నారు. పనులు పూర్తి కావడంతో రైల్వే జీఎం, డీఆర్‌ఎం ఇటీవల స్టేషన్‌ను పరిశీలించారు. త్వరలో స్టేషన్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

రూ.12 కోట్లతో నిర్మాణ పనులు

పరిశీలించిన జీఎం, డీఆర్‌ఎం

పరవశింపజేస్తున్న అమ్మవారి ప్రతిమలు

ఆలయ ద్వారం వలే స్టేషన్‌ ముఖద్వారం

జోగుళాంబ హాల్ట్‌కు హంగులు1
1/2

జోగుళాంబ హాల్ట్‌కు హంగులు

జోగుళాంబ హాల్ట్‌కు హంగులు2
2/2

జోగుళాంబ హాల్ట్‌కు హంగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement