సాఫ్ట్ స్కిల్స్‌పైపట్టు సాధించాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: సాంకేతిక పరిజ్ఞానం ఉరకలెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ టెక్నాలజీతోపాటు సాఫ్ట్ స్కిల్స్‌పై సైతం పట్టు సాధించాలని ఐసీటీ మాస్టర్ ట్రైనర్ రామకృష్ణ అన్నారు. జేపీఎన్‌సీఈ కళాశాలలో కాగ్నిజెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ పథకం కింద బీటెక్ చదువుతున్న 62మంది విద్యార్థినులకు 18రోజులపాటు నిర్వహించే టెక్‌ఫర్‌ఆల్ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఐసీటీ అకాడమీ వారు ఇస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఐ అప్లికేషన్లతోపాటు సాఫ్ట్ స్కిల్స్‌పై సైతం శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సీఎస్‌ఈ సీనియర్ అధ్యాపకులు రాధిక, జమున, స్వాతి విద్యార్థునులకు శిక్షణ కార్యక్రమంలో ఇచ్చే సలహాలు, సూచనలు భవిష్యత్‌లో ఎలా ఉపయోగపడుతాయనే అంశాలను వివరించారు. శిక్షణ శిబిరం విద్యార్థినులకు ఉద్యోగ ఎంపిక ప్రక్రియకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ విభాగం అధికారి దివ్యతేజ, శ్రవంతి, రాహుల్, నితీష్ తదితరులు పాల్గొన్నారు.


