జనరల్‌లోనూ బీసీలు
ఉమ్మడి జిల్లాలో జనరల్ స్థానాల్లో బీసీల హవా
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల పాలకవర్గాలు కొలువుదీరాయి. ఉమ్మడి జిల్లాలోని 8 మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలు జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. వీటిలో ఏకంగా ఏడు స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన వారే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. వనపర్తి మున్సిపాలిటీ మినహా మిగతా అన్‌రిజర్వ్‌డ్ మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీసీలే కై వసం చేసుకున్నారు. కల్వకుర్తి, గద్వాల, కోస్గి, నారాయణపేట, మక్తల్, అమరచింత, పెబ్బేర్ మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉండగా ఆయా చోట్ల బీసీలు చైర్మన్లుగా ఎన్నికయ్యారు.
● ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు మరో 18 మున్సిపాలిటీలకు 8 చోట్ల మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలు అన్‌రిజర్వ్ అయ్యాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌గా ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన భృంగి రత్నమాల ఎన్నికయ్యారు. గద్వాల మున్సిపాలిటీలో బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల జయలక్ష్మి చైర్‌పర్సన్ అయ్యారు. కోస్గి మున్సిపాలిటీలో బీసీ వర్గానికి చెందిన నాగులపల్లి నరేందర్, నారాయణపేటలో బీజేపీ నుంచి యాదవ వర్గానికి చెందిన కొండ శ్వేత ఎన్నికయ్యారు. మక్తల్‌లో చైర్మన్ స్థానం జనరల్‌గా ఉండగా ఇక్కడ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మహిళ వాకిటి మానసకు అవకాశం దక్కింది. అమరచింతలో యాదవ సామాజిక వర్గానికి చెందిన జింక సువర్ణ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. పెబ్బేర్‌లో చైర్మన్‌గా అక్కి శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశం దక్కింది.
వార్డుస్థానాల్లో అత్యధికంగా బీసీల ఎన్నిక..
మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్‌రిజర్వ్‌డ్ వార్డుల్లోనూ అత్యధిక స్థానాల్లో బీసీలు గెలుపొందారు. ఉ మ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 159 వార్డులు జనరల్‌కు కేటాయించగా, వీటిలో 84 మంది బీసీలు కౌన్సిలర్లుగా గెలుపొందారు. అత్యధికంగా గద్వాల మున్సిపాలిటీలో 15 మంది బీసీలు జనరల్ స్థానాల్లో విజయ ఢంకా మో గించారు. వనపర్తి మున్సిపాలిటీలో 14 మంది, నారాయణపేటలో 9 మంది, కొల్లాపూర్ లో 8 మంది, మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 8 మంది బీసీలు గెలుపొందారు. వీరితో పాటు మరో 8మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీ లు జనరల్‌గా ఉన్న వార్డుల్లో విజయం సాధించారు. కల్వకుర్తిలో రెండు జనరల్ స్థానాల్లో ఎస్టీలు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు.
అన్ రిజర్వ్‌డ్‌గా ఉన్న 8 పురపాలికల్లో 7 చోట్ల బీసీలే చైర్మన్లు
కల్వకుర్తి, గద్వాల, కోస్గి, నారాయణపేట, మక్తల్, అమరచింత, పెబ్బేరులో చైర్మన్ స్థానాలు బీసీల వశం
వనపర్తిలో మాత్రమే ఓసీలకు దక్కిన చైర్మన్ పీఠం
143 జనరల్ వార్డుల్లో 84 మంది బీసీలు కౌన్సిలర్లుగా గెలుపు
జనరల్‌లోనూ బీసీలు
జనరల్‌లోనూ బీసీలు


