తీర్పు రిజర్వ్‌.. | - | Sakshi
Sakshi News home page

తీర్పు రిజర్వ్‌..

Feb 12 2026 1:22 PM | Updated on Feb 12 2026 1:22 PM

తీర్ప

తీర్పు రిజర్వ్‌..

ప్రశాంతంగా ముగిసిన మున్సి‘పోల్స్‌’

19 పురపాలికల్లో మొత్తంగా 75 శాతం పోలింగ్‌

గద్వాల జిల్లాలో అత్యధికం.. మహబూబ్‌నగర్‌లో అత్యల్పం

అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే..

రేపు ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాల వెల్లడి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి పాలమూరులో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఐదు జిల్లాల పరిధిలోని ఒక కార్పొరేషన్‌, 18 మున్సిపాలిటీల్లో మొత్తం 373 డివిజన్లు/వార్డు స్థానాలకు బుధవారం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్‌ ప్రారంభమైనప్పటికీ.. 11 గంటల తర్వాతే ఓటర్ల రాక ఊపందుకుంది. నిర్దేశిత సమయం సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తంగా 75 శాతం పోలింగ్‌ నమోదైంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఓటరు తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో రిజర్వ్‌ కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. 14న మున్సిపాలిటీల్లో చైర్మన్‌/చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్లన్లు.. కార్పొరేషన్‌లో మేయర్‌, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత 16న పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.

35 మందిలో 16 మంది..

ఉమ్మడి జిల్లాలోని పుర పాలికల్లో ఇతన ఓటర్లు 35 మంది ఉన్నారు. వీరిలో 16 మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

పట్టణ మహిళల వెనుకంజ..

మ్మడి జిల్లాలోని పోలింగ్‌ జరిగిన పురపాలికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా.. ఓటు హక్కు వినియోగంలో వారే వెనుకబడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తగా.. పుర పోరుకు వచ్చేసరికి అతివలు ఓటుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌గనర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సరాసరిగా పురుషులు, మహిళల ఓటింగ్‌ శాతం సమానంగా ఉండగా.. మిగతా జిల్లాల్లో ఒక్క శాతానికి పైగానే తేడా ఉంది.మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు, గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి, నారాయణపేట, మక్తల్‌, మద్దూర్‌, కొల్లాపూర్‌లో మహళలు ఓటుకు దూరంగా ఉన్నారు. భూత్పూర్‌, కోస్గి, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తిలో మాత్రమే అతివల ఓటింగ్‌ శాతం పురుషుల కంటే కొంత మేర మెరుగ్గా ఉంది.

బద్ధకించిన కార్పొరేషన్‌ ఓటర్లు..

జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అత్యధికంగా 78.22 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అత్యల్పంగా 67.73 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన తర్వాత తొలి సారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో నగర ఓటర్లు ఓటెత్తుతారని అందరూ భావించారు. ఇందుకు విరుద్ధంగా అత్యల్పంగా పోలింగ్‌ నమోదు కావడంతో ఈ ప్రభావం ఎవరిపై పడుతోందని రాజకీయ పార్టీల నేతలు డివిజన్ల వారీగా లెక్కల్లో మునిగారు. నాగర్‌కర్నూల్‌ 77.64 శాతంతో రెండు, వనపర్తి 75.56 శాతంతో మూడు, నారాయణపేట 74.04 శాతంతో నాలుగో స్థానంలో నిలిచాయి.

తీర్పు రిజర్వ్‌..1
1/2

తీర్పు రిజర్వ్‌..

తీర్పు రిజర్వ్‌..2
2/2

తీర్పు రిజర్వ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement