రూ.1.17 లక్షలు పట్టివేత
నారాయణపేట: పుర ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో మంగళవారం పట్టణంలోని ఎర్రగుట్ట చెక్‌పోస్ట్ వద్ద రూ.1.17 లక్షలు పట్టుబడినట్లు సీఐ శివశంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ షఫీ యాద్గిర్ నుంచి నగదు తీసుకెళ్తుండగా ఎర్రగుట్ట చెక్‌పోస్ట్ వద్ద తనిఖీల్లో పట్టుకున్నామని చెప్పారు. సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఎన్నికల నిబంధనల మేరకు స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎన్నికల నిబంధనలు విధిగా పాటించాలని ఆయన సూచించారు.


