అత్తాకోడళ్ల జయభేరి | - | Sakshi
Sakshi News home page

అత్తాకోడళ్ల జయభేరి

Feb 14 2026 9:28 AM | Updated on Feb 14 2026 9:28 AM

అత్తా

అత్తాకోడళ్ల జయభేరి

అక్క గెలుపు, చెల్లెలి ఓటమి అత్త, అల్లుడు ఓటమి

భార్య గెలుపు.. భర్త ఓటమి

కదిరె రాములు

దంపతులు

నారాయణపేట మున్సిపాలిటీలో అత్తాకోడళ్లు ఇద్దరు వేర్వేరు జాతీయ పార్టీల నుంచి విజయం సాధించారు. వరుసకు అత్త అయ్యే కల్పన 17వ వార్డులో బీజేపీ తరపున, కోడలు శ్వేత 20వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందారు.

– గద్వాల

ద్వాలలో అక్కాచెల్లెలు ఇద్దరూ కూడా ఒకేపార్టీ నుంచి పక్కపక్క వార్డుల్లో పోటీ చేసి మిశ్రమ ఫలితం సాధించారు. 33వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా బండల పద్మావతి పోటీచేసి ఓటమి చెందారు. 34వ వార్డు నుంచి ఆమె సోదరి బండల రామలక్ష్మి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు.

కల్వకుర్తి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో భార్యభర్తలిద్దరూ విజయకేతనం ఎగరేయాలని అనుకున్నారు. ఓటర్లు భార్యను మాత్రమే గెలిపించి, భర్తకు మాత్రం ఓటమిని చవిచూపారు. ఎన్నికల్లో 7వ వార్డులో కాంగ్రెస్‌ పార్టీ తరఫున చైర్మన్‌ అభ్య ర్థిగా పోటీచేసిన రత్నమాల తన సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇందుపై 425 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 13వ వార్డులో పోటీచేసిన ఆమె భర్త ఆనంద్‌కుమార్‌ బీజేపీ అభ్యర్థి నర్సింహ చేతిలో 63ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019, 2026 మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిల్‌లోకి అడుగు పెడుదామనుకున్న ఆనంద్‌కుమార్‌ మరోసారి ఓటమి పాలయ్యారు. భర్త ఓడిపోయిన భార్య గెలవడంతో చైర్మన్‌ పదవి రత్నమాలకు వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ద్వాలలో అత్త, అల్లుడు పలు వార్డుల నుంచి వివిధ పార్టీల తరఫున పోటీచేసి ఓటమి చెందారు. నాలుగో వార్డు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శారద పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఇమె అల్లుడు మహేశ్‌ 25వ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో విచిత్రాలు

గద్వాల మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో విచిత్రాలు ఆవిష్కృతమయ్యాయి. భార్యాభర్తలు, అక్కాచెల్లెలు, అత్తాఅల్లుడు ఇలా పలు వార్డుల్లో పోటీ చేసి మిశ్రమ ఫలితాలను చవిచూశారు. వాటి వివరాలిలా..

అత్తాకోడళ్ల జయభేరి1
1/2

అత్తాకోడళ్ల జయభేరి

అత్తాకోడళ్ల జయభేరి2
2/2

అత్తాకోడళ్ల జయభేరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement