లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం

Apr 4 2026 8:31 AM | Updated on Apr 4 2026 8:31 AM

కృష్ణా: మండలంలోని గుడెబల్లూర్‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున శ్రీ స్వయంభు లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని వేలాది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య, మంగళవాయిద్యాలతో కనులపండువగా చే శారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజ లు, అలంకరణ, అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు పాల ఉట్టి పగులగొట్టారు. అనంతరం భజనమండలి చేత భజన గీతాలు ఆలపించారు. ఉత్సవాలకు స్థానికులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి వేలాది మంది భక్తులు హాజరై మొక్కులు తీర్చుకునున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండగా నిర్వాహకులు తాగునీరు, వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement