అచ్చంపేట రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా, నియోజకవర్గం నుంచే యాదవుల తిరుగుబాటు యుద్ధం ప్రారంభిస్తామని యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్‌కుమార్‌యాదవ్ అన్నారు. పట్టణంలోని టీఎన్‌జీఓ భవనంలో శుక్రవారం యాదవ జేఏసీ చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. నల్లమల ప్రాంతం నుంచే యాదవుల యుద్ధం ప్రారంభమైందన్నారు. నల్లమల్ల అడివిని గొర్రెల మేత కోసం గొర్రె కాపరులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యాదవులపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో యాదవులకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవులల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. రూ.5వేల కోట్లతో యాదవ కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కోకాపేట్‌లో ఏర్పాటు చేస్తున్న యాదవ భవనాన్ని వెంటనే ప్రారంభించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు శివశంకర్, కాశీం, నరేష్, యాదవ్, ప్రశాంత్, శ్రీనివాస్, కాశన్న, వెంకటేష్, సత్తయ్య, అజయ్, మహేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు.


