ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు
తీవ్ర ఎండల్లో కూడా తగ్గని భక్తుల రాక
భద్రతా ఏర్పాట్లు భేష్
సలేశ్వరం ఉత్సవాల ప్రశాంతంగా ముగిశాయని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. శుక్రవారం ఉదయం ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి సలేశ్వర క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సలేశ్వరంలో 400మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, మూడురోజులపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సలేశ్వరం వచ్చిన భక్తులు వచ్చిన దారినే వెళ్లాలని, డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్లకూడదని సూచించారు. సలేశ్వరంలో పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై సంతప్తి వ్యక్తం చేస్తూ విధులపై సిబ్బంది చూపుతున్న అంకితభావాన్ని ప్రశంసించడంతోపాటు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గురువారం రాత్రి నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ బాబుమియా ప్రమాదవశాత్తు లోయలో పడిపోగా.. విధుల్లో ఉన్న ఎస్‌ఐ మురళి, కానిస్టేబుళ్లు ఊర్మిళ, మణిక్యాలు వెంటనే గమనించి అతన్ని గట్టుపైకి తీసుకొచ్చి వైద్యం అందించడంపై కానిస్టేబుళ్లను ప్రశంసించారు.
ఫర్హాబాద్ వద్ద
చెక్‌పోస్టుల మూసివేత
మూడు రోజుల్లో
3లక్షల మంది దర్శనం
అచ్చంపేట: తెలంగాణ అమర్‌నాథ్‌గా పేరుగాంచిన సలేశ్వర క్షేత్రం ఉత్సవాలు శుక్రవారంతో మగిశాయి. మూడురోజులపాటు నల్లమల అభయారణ్యం జనసంద్రంతో నిండుగా కనిపించింది. శివనామస్మరణంతో మారుమోగిన నల్లమల కొండలు నేటినుంచి మూగబోనున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన సలేశ్వరం క్షేత్రం దర్శనానికి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు రావడంతో కిక్కిరిసింది. చివరిరోజు శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి వాహనాలు ఆడవిలోకి వెళ్లకుండా అటవీశాఖ నిలిపివేసింది. ఈసారి పోలీస్, అటవీశాఖలు సమన్వయంతో ఇచ్చిన మూడురోజుల్లో 24గంటలపాటు సలేశ్వరం దర్శనానికి అనుమతించడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. రాత్రివేళ ఎక్కువ మంది దర్శనం చేసుకోవడం అనుభూతినిచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ పేరుతో అటవీశాఖ విధించిన అంక్షలతో మూడేళ్లలో భక్తుల సంఖ్య తగ్గడం, ఆలయాలపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శల కారణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ ఏడాది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ప్రతిఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా వర్షం కురిసేది. మూడేళ్లుగా అలాంటిదేదీ లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపీరిపీల్చుకున్నారు. చివరిరోజు వస్తున్నాం లింగమయ్యా.. వెళ్లొస్తాం లింగమయ్య నామం జపించారు.
లోయలో భద్రత
గాలికి..
సలేశ్వరం ఉత్సవాలకు వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు లోయలో భద్రత కరువైంది. పోలీస్ సిబ్బంది, అటవీశాఖ వలంటీర్లను ఏర్పాటు చేసినప్పటికీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయలేపోయారు. వేలాదిమంది గుమ్మిగూడిన చోట నియంత్రణ, భద్రత చర్యలు నామమాత్రంగా కనిపించాయి. పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ వాహనాదారులు అటవీ ప్రాంతంలో ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పెరిగిన బందోబస్తు
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్, అటవీశాఖలు సమన్వయంతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వారి అంచనాలకు మించి వాహనాలు, భక్తులు రావడంతో వారి సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ముందుస్తుగా అడవిలో చెత్త నిర్వహణ, తొలగింపు, వాహనాల ట్రాఫిక్, లోయ వద్ద భక్తుల రద్దీ నియంత్రణ, బారీకేడ్లు, భద్రత నిర్వహణను పోలీస్, అటవీ శాఖ సంయుక్తంగా చేపట్టింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలు సజావుగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపీరి పీల్చుకుంది.
సలేశ్వరం లోయలో భక్తులు
సలేశ్వరం కొండల్లో భక్తులు
చెక్‌పోస్టులు మూసివేత
దాతల సేవలే పరమార్థం
హైదారాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిలోని ఫర్హాబాద్, లింగాల మండలం అప్పాయిపల్లి ప్రాంతంలోని చెక్‌పోస్టులను అటవీశాఖ అధికారులు మూసివేశారు. ఈసారి అంచనాలకు మించి వాహనాలు రావడంతో ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్, అటవీశాఖలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు మాత్రమే అనుమతించనున్నట్లు పోలీస్, అటవీశాఖ సంయుక్త ప్రకటన చేసినా.. భక్తులు మార్చి 30, 31వ తేదీల్లో కూడా తరలి రావడంతో ముందుస్తుగా అనుమంతించారు. అచ్చంపేట ఆర్టీసీ మొదటిరోజు 28, రెండోరోజు 32, మూడరోజు16 ట్రిప్పుల చొప్పున బస్సులు నడిపించారు. అటవీ ప్రాంతంలో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని చివరిరోజు మధ్యాహ్నం 2గంటలకే బస్సులను నిలపివేశారు.
స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఏర్పాటు చేసిన అన్నదానం, అంబలి కేంద్రాలు, తాగునీటి వసతి భక్తులకు ఎండవేడి నుంచి కాపోడుకోవడానికి ఎంతగానో ఉపకరించాయి. సలేశ్వరం ఉత్సవాలతో అటవీశాఖ ముక్కిపిండి టోల్ ేరుసుము వసూలు చేసింది. సలేశ్వరం ఉత్సవాలు మాత్రం అటవీశాఖకు మంచి ఆదాయ వనరుగా నిలిచిందనే చర్చ సాగుతోంది. ఏటా రూ.లక్షలాది ఆదాయం సమకూరుతున్న అటవీశాఖ సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది.


