రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల పరిశీలన
ఉండవెల్లి: మండలంలోని జోగుళాంబ రైల్వే స్టేషన్‌ను ఆదివారం సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్‌ఎం సంతోష్‌కుమార్ వర్మ పరిశీలించారు. జోగుళాంబ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనుల్లో భాగంగా విశ్రాంతి గదులు, హైలెవెల్ ఫ్లాట్‌ఫాం, గదులలో ఏర్పాటు చేసిన పరికరాల నాణ్యత, మౌలిక వసతుల కల్పన, నీటి సదుపాయాన్ని డీఆర్‌ఎం పరిశీలించారు. స్టేషన్‌కు సమీప మార్గంలో సూచిక బోర్డు లేకపోవడంతో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో రైల్వే జీఎం స్టేషన్‌ను పరిశీలించి పునఃప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, ఇంజినీయర్లు తదితరులు పాల్గొన్నారు.


