అగ్నికి ఆహుతైన శ్రీగంధం చెట్లు | - | Sakshi
Sakshi News home page

అగ్నికి ఆహుతైన శ్రీగంధం చెట్లు

Feb 16 2026 8:35 AM | Updated on Feb 16 2026 8:35 AM

అగ్ని

అగ్నికి ఆహుతైన శ్రీగంధం చెట్లు

రూ.5 లక్షల నష్టం

మాగనూర్‌: మండల పరిధిలోని అచ్చంపేట శివారులో నర్సింగ్‌ రాథోడ్‌ అనే రైతుకు చెందిన శ్రీగంధం, గందపు చెట్లు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. కర్ణాటక రాష్ట్రం దేవసూగురుకు చెందిన రాథోడ్‌ 11 ఎకరాల్లో శ్రీగంధం, గందపు చెట్లు సాగు చేశాడు. అయితే ఆదివారం తోటలో మంటలు వ్యాపించినట్లు తోటి రైతులు అతడికి సమాచారం అందించారు. అతడు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి తాను రైతులతో వెళ్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమయానికి స్పందించిన ఫైర్‌ ఇంజిన్‌ సిబ్బంది స్థానిక పోలిసుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే అనేక చెట్లు కాలి బూడిద అయ్యాయి. ప్రమాదంలో దాదాపు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని రైతు నర్సింగ్‌రాథోడ్‌ వాపోయారు.

కాలిన గాయాలతో మహిళ మృతి

కొల్లాపూర్‌: గ్యాస్‌ స్టవ్‌పై వంట చేస్తూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గాయపడిన మహిళ ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. పూర్తి వివరాలు.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్‌దిన్నె చెందిన మంగలి దేవేంద్రమ్మ ఈ నెల 9న ఇంట్లో గ్యాస్‌స్టవ్‌పై వంట చేస్తుండగా నిప్పంటుకొని తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు.

అగ్నికి ఆహుతైన శ్రీగంధం చెట్లు 
1
1/2

అగ్నికి ఆహుతైన శ్రీగంధం చెట్లు

అగ్నికి ఆహుతైన శ్రీగంధం చెట్లు 
2
2/2

అగ్నికి ఆహుతైన శ్రీగంధం చెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement