శ్రీశైలం వెళ్తూ యువకుడు..
నవాబుపేట: శివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్తున్న యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. మండల పరిధిలోని గురకుంట గ్రామానికి శ్రీనివాస్(25) మిత్రుడు కేశవులుతో కలిసి శనివారం శ్రీశైలం బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున అచ్చంపేట సరిహద్దులో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాగా కేశవులు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేశవులను చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడటంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


