కాస్త మెరుగ్గా ‘కమలం’ | - | Sakshi
Sakshi News home page

కాస్త మెరుగ్గా ‘కమలం’

Feb 18 2026 8:06 AM | Updated on Feb 18 2026 8:06 AM

కాస్త మెరుగ్గా ‘కమలం’

కాస్త మెరుగ్గా ‘కమలం’

పాలమూరు: అర్బన్‌ ఏరియాల్లో సాధరణంగా పట్టు ఉన్న బీజేపీ. పాలమూరు నగరంలో ఊహించిన స్థాయిలో ఫలితాలు పొందడం లేదు. ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ స్వల్పంగా పుంజుకొని సీట్ల సంఖ్య పెంచుకుంది. గతంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుపొందిన బీజేపీ.. ఐదేళ్ల తర్వాత జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 8 స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అగ్రనేతలు ఎన్నికల నేపథ్యంలో సభ నిర్వహించిన పెద్దగా ప్రభావం చూపలేదు. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లలో 52 స్థానాల్లో పోటీకి దిగగా 8 చోట్ల విజయం సాధించింది. మరో ఐదుచోట్ల రెండో స్థానంలో నిలిచింది. దీంట్లో మూడో డివిజన్‌ అప్పన్నపల్లిలో 678, 12వ డివిజన్‌ వీరన్నపేటలో 423, 15వ డివిజన్‌ చిన్నదర్పల్లిలో 1070, 26వ డివిజన్‌ శివశక్తినగర్‌లో 881, 33వ డివిజన్‌ వీరన్నపేట్‌ గేట్‌లో 663 ఓట్లు వచ్చాయి. మిగిలిన డివిజన్లలో మూడో, నాలుగో స్థానంలో రావడం జరిగింది. బీజేపీకి బాగా పట్టు ఉన్న ఏరియాలు లక్ష్మీనగర్‌కాలనీ, శ్రీనివాసకాలనీ, పద్మావతికాలనీ, కొత్తచెరువురోడ్‌, న్యూగంజ్‌, పాతబస్టాండ్‌, కిద్వాయిపేట, భగీరథకాలనీ ఏరియాల్లో మంచి ఓటు బ్యాంకు సాధించింది. గ్రామాలు, తండాలు ఉన్న డివిజన్లలో నాల్గవ స్థానంలో ఉండటం విశేషం.

గెలుపొందిన డివిజన్ల వివరాలు

పాలమూరులో 8 స్థానాల్లో గెలుపు

ఐదుచోట్ల రెండో స్థానానికి పరిమితం

చాలా ఏరియాల్లో ప్రభావం చూపని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement