నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాం: మంత్రి వాకిటి | - | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాం: మంత్రి వాకిటి

Feb 11 2026 8:33 AM | Updated on Feb 11 2026 8:33 AM

నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాం: మంత్రి వాకిటి

నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాం: మంత్రి వాకిటి

నారాయణపేట/ మక్తల్‌: మహదేవప్ప ఆత్మహత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. స్థానిక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. మహదేవప్ప మృతిపై బీజేపీ నేతల మాటలు అత్యంత అమానవీయంగా ఉన్నాయన్నారు. మహదేవప్ప ఆత్మహత్యను రాజకీయాల కోసం బీజేపీ నేతలు వాడుకోవాలని చూడటం అనైతికమన్నారు. ఘర్షణ, ఫ్యాక్షన్‌ రాజకీయాలకు నేను వ్యతిరేకమన్నారు. చీమకు హాని చేయని వ్యక్తిత్వం తనదని, ఆరోగ్యకరమైన రాజకీయాలను కోరుకునే వాడినన్నారు. సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగిన తాను రాజకీయ జీవితంలో ఏ ఒక్కరికి హాని తలపెట్టలేదన్నారు. మహదేవప్ప కుటుంబానికి అండగా నిలబడాల్సిన బీజేపీ నేతలు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌ వ్యాఖ్యలు బాఽ ద్యత మరిచి మాట్లాడినట్లుగా ఉందన్నారు. మహ దేవప్ప ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒకవేళ నిరూపిస్తే దేనికై నా సిద్ధమని సవాల్‌ చేశారు. మహదేవప్ప ఆత్మహత్య విషయంలో మీడియా వాస్తవాలను చూపాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement