పీయూకు బ్యాలెట్ బాక్సులు తరలింపు
● స్ట్రాంగ్‌రూంలను పరిశీలించిన కలెక్టర్ విజయేందిర
పాలమూరు: మహబూబ్‌నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత సంబంధిత బ్యాలెట్ బాక్సులను పాలమూరు యూనివర్సిటీకి తరలించారు. వేరువేరు భవనాల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూంలు, రిసెప్షన్ సెంటర్‌లను బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పరిశీలించారు. ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ప్రత్యేక భవనంలోని వేరు వేరు గదుల్లో భద్రపరిచారు.
భద్రపరిచేందుకు బ్యాలెట్‌బాక్స్‌లను తీసుకెళ్తున్న సిబ్బంది


