ఎవరికి ఓటు వేశారో చెబితే నేరమే
పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసి వచ్చిన తర్వాత ఎవరికి ఓటు వేశారు అనే విషయాన్ని గోప్యంగా ఉంచాలి. బహిరంగంగా వెల్లడిస్తే ఎన్నికల కమిషన్ దానిని నేరంగా పరిగణిస్తుంది. ఓటుహక్కును వినియోగించుకునే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటువేసే పద్ధతిని పాటించకపోతే ఎన్నికల సంఘం నియమావళి 49–ఏ ప్రకారం ఓటింగ్‌కు అనర్హులు. ఓటింగ్ సమయంలో ఆలస్యం జరిగిన, వెళ్లిన ఓటరు బ్యాలెట్ బాక్స్‌పై కాగితాలు, టేపులు అతికిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలింగ్ ఏజెంట్లు రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఓటింగ్ బూతులోకి వెళ్ళవచ్చు. రిటర్నింగ్ అధికారి మాత్రమే అది బాగానే ఉందని ఏజెంట్ల సమక్షంలో నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.


