ఉద్యోగం వదిలి.. పుర బరిలోకి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం వదిలి.. పుర బరిలోకి

Feb 9 2026 8:39 AM | Updated on Feb 9 2026 8:39 AM

ఉద్యోగం వదిలి.. పుర బరిలోకి

ఉద్యోగం వదిలి.. పుర బరిలోకి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): కార్పొరేషన్‌ పరిధిలోని పదో డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేట్‌ అభ్యర్థిగా రమేష్‌బాబు పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2020 మున్సిపల్‌ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయిన నిరుత్సాహ పడకుండా ప్రస్తుతం కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. తాగునీరు, డ్రెయినేజీ, రహదారులు, పేదల సమస్యలు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. తన పట్టుదలను గుర్తించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇచ్చారని రమేష్‌బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement