అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
కొల్లాపూర్: కాంగ్రెస్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. 13 వార్డు పరిధిలోని చౌటబెట్ల గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. వంగ అనూష రాజశేఖర్‌గౌడ్‌ను గెలిపించాలని కోరారు. గ్రామానికి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని, గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్‌పై రూ. 500 రాయితీ, నివాస గృహాలకు ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ చేస్తున్నట్లు వివరించారు. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గత పాలకులు కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి గుర్చి పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. మంత్రి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.


