‘ఫోన్’లోనే ప్రచారం
గద్వాలమున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువులు పోటీ చేస్తున్నారు. వారి తరఫున నేరుగా ప్రచారం చేయాలంటే నిబంధనలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ప్రత్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారనే భయం. మరోపక్క అలాంటి వారుందరూ ‘ఫోన్’ ప్రచారం ప్రారంభించారు. వార్డుల్లోని పలువురి ఓటర్ల ఫోన్ నంబర్లు తెప్పించుకొని, వారితో పరిచయం చేసుకుని ఓటు వేసి తమవారిని గెలిపించాలని కోరుతున్నారు. పట్టణంలోని 2, 3, 6, 17, 16, 17, 18, 28 వార్డుల్లో ఎక్కువగా ఫోన్ అభ్యర్థనలు ఉన్నాయి. విధులు ముగించుకొని ఇంటికి రాగానే ఈ తరహ ప్రచారం చేపట్టడం విశేషం. దీంతో పాటు రెండు రోజులుగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగ, ఉపాధ్యాయుల జాబితాను ముందుగానే సేకరించి, ముఖ్య నాయకులతో వారికి ఫోన్ చేయిస్తున్నారు.


