నేటినుంచి ఎస్‌జీఎఫ్ క్రికెట్ టోర్నీ
ఏర్పాట్లు పూర్తి చేశాం
● ఉమ్మడి జిల్లాల నుంచి పాల్గొనున్న
అండర్–17 బాలుర జట్లు
● మూడు మైదానాల్లో 24మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు
జడ్చర్ల టౌన్: జడ్చర్లలో శుక్రవారం జరగనున్న ఎస్‌జీఎఫ్ అండర్–17 బాలుర రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి 10జట్లు పాల్గొంటున్న టోర్నీలో మొత్తం 24మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందుకు పట్టణంలో జడ్చర్ల మినీస్టేడియం, బాదేపల్లి బాలుర జెడ్పీహైస్కూల్, స్వామి నారాయణ గురుకుల పాఠశాలలోని మైదానాలు సిద్ధం చేశారు. నాలుగు రోజులపాటు జరిగే టోర్నీలో 20లీగ్‌మ్యాచ్‌లు, 2 సెమీఫైనల్ మ్యాచ్‌లు, మూడో స్థానం కోసం ఒకమ్యాచ్, ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. టోర్నీకి ఇప్పటికే స్వామినారాయణ గురుకుల పాఠశాలలోని మైదానంలో మ్యాట్‌ను సిద్ధం చేశారు. జడ్చర్ల మినీస్టేడియంలో ఇప్పటికే జేఏఆర్ ప్రీమియం లీగ్ నడుస్తుండడంతో టోర్నీకి గ్రౌండ్ సిద్ధంగానే ఉంది. బాదేపల్లి జెడ్పీ హైస్కూల్‌లోని కింది మైదానాన్ని టోర్నీలోని మ్యాచ్‌లకు తీర్చిదిద్దుతున్నారు. టోర్నీ ముగిశాక ఏప్రిల్‌లో జాతీయ పోటీలు జడ్చర్లలోనే నిర్వహించనున్నారు.
రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. జడ్చర్ల మినీస్టేడియం, బాదేపల్లి బాలుర జెడ్పీహైస్కూల్ మైదానం, స్వామి నారాయణ గురుకుల పాఠశాల మైదానంలో నాలుగురోజులపాటు క్రీడలు నిర్వహిస్తున్నాం. మొత్తం 10 ఉమ్మడి జిల్లాల నుంచి జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. మొత్తం 24 మ్యాచ్‌లు ఉండగా 20లీగ్‌మ్యాచ్‌లు, 2 సెమిఫైనల్‌లు, ఒకటి మూడో స్థానం కోసం, తర్వాత ఫైనల్ మ్యాచ్ పెడుతున్నాం.
– మంజులాదేవి,
ఎస్‌జీఎఫ్ క్రికెట్ టోర్నీ కో ఆర్డినేటర్


