విద్యుదాఘాతంతో బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

Feb 13 2026 3:58 AM | Updated on Feb 13 2026 3:58 AM

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

ఇందిరమ్మ ఇంటికి నీళ్లు

పడుతుండగా ఘటన

బిజినేపల్లి: నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటికి నీళ్లు పడుతుండగా కరెంట్‌ షాక్‌కు గురై ఓ బాలుడు మృతిచెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని వెల్గొండ గ్రామంలో పంచాయతీలో పనిచేస్తున్న శశికళ అనే కార్మికురాలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటుంది. కొత్తగా కట్టిన గోడకు నీళ్లు పట్టిన తర్వాత ఆమె కుమారుడు ఉపేందర్‌(14) మోటార్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడానికి ఫ్లగ్‌ తీయబోయాడు. అప్పటికే నీటితో మోటార్‌ బోర్డు తడవడంతో ఎర్త్‌ వచ్చి బాలుడు అక్కడికక్కడే పడిపోయి చనిపోయాడు. కొద్ది సంవత్సరాల క్రితమే తండ్రి రాములు కూడా మరణించడంతో ఆ ఇంటిలో విషాదచాయలు అలుముకున్నాయి.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి మృతి

మరికల్‌: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన తీలేర్‌ స్టేజీ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌గౌస్‌(45) ఊట్కూర్‌ మండలం పగిడిమారిలో తనకు కూతురును చూసేందుకు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో నారాయణపేట డిపో బస్సు ఎక్కాడు. అప్పటికే మద్యంతాగి ఉండడంతో బస్సుల్లో అల్లరి చేయడంతో మరికల్‌ మండలం తీలేర్‌ స్టేజీ సమీపంలో రాత్రి 10గంటల సమయంలో బస్సును నిలిపి దింపేశారు. రోడ్డుపై ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డుపై అక్కడిక్కడా తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొన్నడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతాదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని మృతుడి వద్ద ఉన్న ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇ చ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ఎల్లయ్య తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

హన్వాడ: మండలంలోని పెద్దర్పల్లికి చెందిన యువకుడు కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపారు. పోలీసుల కథనం ప్రకార.. గ్రామానికి చెందిన బోయిని శివరాజు(30) గతేడాదిగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. బుధవారం రాత్రి కడుపునొప్పి తీవ్రమవడంతో ఇంట్లోని మరో గదిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబీకులు జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలున్నారు. మృతుడి అన్న బోయిని కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డుప్రమాదంలో

యువకుడు మృతి

గోపాల్‌పేట: ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతిచెందిన ఘటన రేవల్లి మండలంలోని గొల్లపల్లి గేటు సమీపంలో చోటుచేసుకుంది. రేవల్లి ఎస్‌ఐ రజిత కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెన్నచెర్లకు చెందిన వంగూరి కురుమూర్తి(31) వనపర్తి నుంచి వెన్నచర్లకు సాయంత్రం ఏడుగంటల సమయంలో వెళ్తుండగా గొల్లపల్లి గేటు సమీపంలో మలుపువద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదే విషయంపై గురువారం కురుమూర్తి తల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

వ్యక్తి బలవన్మరణం

ఉండవెల్లి: మండలంలోని బొంకూరుకు చెందిన వ్యక్తి మద్యం మత్తులో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్ణ(31) కొన్నేళ్లుగా మతిస్థిమితం లేక పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడు. బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో మద్యం మత్తులో తాడుతో ఊరేసుకున్నాడు. ఉదయం తల్లి వెళ్లి చూడగా.. ఉరేసుకుని ఉండగా చుట్టుపక్కల వారిని పిలిచి చూడగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులు పరిశీలించి పోస్టుమార్టంకు తరలించారు. గురువారం తల్లి బోయ నాగమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం.

తెల్లరాళ్లపల్లితండాలో విషాదఛాయాలు

పాన్‌గల్‌: హైదరాబాద్‌–కల్వకుర్తి ప్రధాన రహదారిపైన వెల్దండ మండలంలోని కొట్ర రెవెన్యూ శివారులో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తూ బుధవారం ట్రాక్టర్‌, ఆటో ఢీకొన్న ఘటనలో మండలంలోని తెల్లరాళ్లపల్లితండాకు చెందిన కేతావత్‌ సురేష్‌ మృతి చెందడంతో తండాలో విషాదఛాయాలు అలుముకున్నాయి. గురువారం స్వగ్రామమైన తండాకు మృతదేహాన్ని తీసుకరావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ హైదరాబాద్‌లోని బీరంగూడలో నివాసం ఉంటున్నాడు. మృతుడికి భార్య సౌమ్య, 8 ఏళ్ల బాబు ఉన్నాడు. బాధిత కుటుంబాన్ని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యనాయక్‌, తండా సర్పంచ్‌ ఉషాలింగానాయక్‌ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement