డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల
మెట్టుగడ్డ: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 252ను సవరించి డెస్క్ జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం డెస్క్ జర్నలిస్ట్‌ల ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన డెస్క్ జర్నలిస్టులు మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టులకు ఎడిషన్ సెంటర్లలో నాలుగు అక్రిడిటేషన్ కార్డులు మాత్రమే ఇస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభు త్వం మంజూరు చేసినట్లుగానే డెస్క్‌లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. పేపర్ సర్క్యులేషన్‌ను ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా చిన్న పత్రికల్లో విధులు నిర్వహించే జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థ లాలు, ఇళ్లు, హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, అక్రిడిటేషన్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రెస్‌క్లబ్‌లో అందరికీ సభ్యత్వం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నూతన కార్యవర్గం ఎన్నిక..
డెస్క్ జర్నలిస్టుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఇందులో అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్ (నమ స్తే తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా మల్లెల విష్ణువర్ధన్‌రెడ్డి (సాక్షి), కోశాధికారిగా రవి (వార్త), ఉపాధ్యక్షులుగా చిన్నకుర్మయ్య (సాక్షి), వెంకటేష్ (ఆంధ్రజ్యోతి), సహాయ కార్యదర్శులుగా బి.వెంకటగిరి (ఫ్రీలాన్స్), ఎ.విష్ణు (నమస్తే తెలంగాణ), కమిటీ సభ్యులుగా నవీన్‌చారి (సాక్షి), నవీన్ (ఆంధ్రజ్యోతి), పరమేష్ (తెలుగుప్రభ), బి.శివకుమార్ (నమస్తే తెలంగాణ), జగదీశ్ (సూర్య), రాష్ట్ర కమిటీ సభ్యులుగా జమ్మన్న (ఆంధ్రజ్యోతి), శ్రీనివాస్‌యాదర్ (నవ తెలంగాణ)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్‌చార్జి తిరుపతయ్య, సాక్షి ఎడిషన్ ఇన్‌చార్జి హరిప్రసాద్, అన్ని పత్రికల సబ్ ఎడిటర్లు పాల్గొన్నారు.


