నగరంలో సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ గుమాల మమత అన్నారు. సోమవారం మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న అనంతరం ఆమె సాక్షితో మాట్లాడారు. ‘మహిళలకు రిజర్వు కావడంతో మేయర్‌గా ఎన్నికయ్యాను. నగరంలో నెలకొన్న విద్యుత్, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటుకు కృషి చేస్తాను.అందరినీ కలుపుకొని పోతా. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటా. నాకు ఈ అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి కృతజ్ఞతలు. కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతాను. ఆయా డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు సభ దృష్టికి తెచ్చినా లేదా నన్ను విడిగా కలిసినా వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తా. నగరంలో 60 డివిజన్లలో తిరిగి ఎక్కడెక్కడ ఏమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటా. ఇప్పటికే మంజూరైన నిధులను ప్రాధాన్యతా క్రమంలో వెచ్చించి అభివృద్ధి చేస్తా. పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేపడతా. ఇందిరమ్మ ఇళ్లు, డ్రెయినేజీలు, తాగునీరు తదితర మౌలిక వసతుల కోసం నా వంతుగా కృషి చేస్తా.’ అని పేర్కొన్నారు. – గుమాల మమత, మేయర్
నగరంలో సమస్యల పరిష్కారానికి కృషి


