నాణ్యమైన విత్తనాలు అందించాలి
బిజినేపల్లి: వ్యవసాయ పరిశీలన, విస్తరణ క్షేత్రాలు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డా.ఎల్.కృష్ణ సూచించారు. బుధవారం మండలంలోని పాలెం ఆర్‌ఏఆర్‌ఎస్‌లో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల జిల్లాస్థాయి సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనోత్పత్తి, జీవన ఎరువుల యాజమాన్యం, డిజిటల్ వ్యవసాయసేవలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు. ఉద్యాన పంటల విలువ జోడింపు, మార్కెటింగ్, శీతల గిడ్డంగులలో నిల్వపై రైతులు, శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు విజయభాస్కర్, చంద్రశేఖర్, నోడల్ అధికారులు డా.ఆదిశంకర్, మధుశేఖర్, డా.పి. ప్రశాంత్, డా.పల్లవి పాల్గొన్నారు.
అనాథ పిల్లలకు 40 క్వింటాళ్ల బియ్యం అందజేత
మహబూబ్‌నగర్ రూరల్: కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ బండమీదిపల్లి శివారులో గల సాందీపని ఆవాసంలో నివసిస్తున్న అనాథ పిల్లలకు సాయం చేసేందుకు మండలంలోని మాచన్‌పల్లి రైతులు సమూహంగా ముందుకొచ్చారు. ఈ క్రమంలో రైతులంతా కలిసి 40 క్వింటాళ్ల బియ్యాన్ని సేకరించి బుధవారం ట్రాక్టర్‌లో ఆవాసానికి తరలించారు. అనంతరం సర్పంచ్ గచ్చుమాలే వెంకటయ్య, ఉప సర్పంచ్ యాట కృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్, మాజీ సర్పంచ్‌లు మల్లికార్జున్‌రెడ్డి, మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సాందీపని ఆవాసం సేవాసమితి అధ్యక్షుడు నారాయణరెడ్డికి బియ్యాన్ని అందించారు. అనాథ పిల్లల కోసం రైతులు ఏకమై 40 క్వింటాళ్ల బియ్యం అందించడం అభినందనీయమని అక్కడికి వచ్చిన వారు ప్రశంసించారు. రైతులు సేవాభావం ఇతరులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
నాణ్యమైన విత్తనాలు అందించాలి


