శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

Feb 11 2026 8:33 AM | Updated on Feb 11 2026 8:33 AM

శ్రీశ

శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

రీజియన్‌ నుంచి 304 కేటాయింపు

మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 13 నుంచి 16 వరకు రాకపోకలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం క్షేత్రానికి మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. రీజియన్‌లోని మొత్తం తొమ్మిది డిపోల నుంచి ఈ నెల 13 నుంచి 16 వరకు 304 ప్రత్యేక బస్సులు రాకపోకలు కొనసాగించనున్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి 72, నాగర్‌కర్నూల్‌ నుంచి 53, వనపర్తి డిపో నుంచి 47, గద్వాల నుంచి 34, అచ్చంపేట డిపో నుంచి 28, నారాయణపేట నుంచి 23, కొల్లాపూర్‌ నుంచి 22, కల్వకుర్తి నుంచి 16, షాద్‌నగర్‌ నుంచి 9 ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. మహాశివరాత్రి రోజు రీజియన్‌ నుంచి 153 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

భక్తులు సద్వినియోగం చేసుకోవాలి..

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రీజియన్‌లోని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని.. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రీజినల్‌ మేనేజర్‌ సంతోష్‌కుమార్‌ కోరారు. భక్తుల రద్దీ మేరకు అవసరమైతే మరిన్ని అదనపు బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుగు ప్రయాణానికిగాను ఈ నెల 15న అర్ధరాత్రి నుంచి 16 సాయంత్రం వరకు బస్సుల రాకపోకలు కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీశైలంతో పాటు ఆయా డిపోల ప్రయాణ ప్రాంగణాల్లో చలువ పందిళ్లు, తాగునీరు, సమాచార వ్యవస్థ, వాలంటీర్లను నియమించామన్నారు.

డిపో తేదీలు

13 14 15 16

మహబూబ్‌నగర్‌ 5 15 36 16

నాగర్‌కర్నూల్‌ 5 11 22 15

వనపర్తి 5 8 22 12

నారాయణపేట 3 3 15 2

అచ్చంపేట 2 8 10 8

గద్వాల – 2 20 12

కల్వకుర్తి – 2 10 4

కొల్లాపూర్‌ 2 4 12 4

షాద్‌నగర్‌ – – 6 3

శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు 1
1/1

శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement