అక్కమహాదేవి గుహల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

అక్కమహాదేవి గుహల అభివృద్ధికి కృషి

Feb 15 2026 12:27 PM | Updated on Feb 15 2026 12:27 PM

అక్కమహాదేవి గుహల అభివృద్ధికి కృషి

అక్కమహాదేవి గుహల అభివృద్ధికి కృషి

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని సోమశిల పరిధిలో అక్కమహాదేవి గుహలను జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ శివస్వాములతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల నుంచి కృష్ణానదిలో లాంచీలో 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కమహాదేవి గుహలు వస్తాయన్నారు. 14వ శతాబ్దం నాటి ఈ గుహలు ఎంతో ప్రాచుర్యం చెందాయన్నారు. ఈ గుహలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టిపెట్టడం జరిగిందన్నారు. నల్లమల ప్రాంతంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈగలపెంట నుంచి అక్కమహాదేవి గుహలకు ప్రత్యేక బోటు ఏర్పాటు చేశామ న్నారు. ఈ బోటు సదుపాయం ఏడాది మొత్తం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని, ఒకరికి టికెట్‌ రూ.600 నిర్ణయించడం జరిగిందన్నారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement