చంటిబిడ్డతో కలిసి ప్రమాణ స్వీకారం
అలంపూర్: మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంతో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒక వార్డు సభ్యురాలు తన కూతురితో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. అలంపూర్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం జరిగింది. సమావేశంలో 1వ వార్డు నుంచి విజయం సాధించిన బీహెచ్ స్వాతి తన చంటిబిడ్డతో ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. తన కూతురిని ఎత్తుకొనే ప్రమాణ స్వీకారం చేసింది. తల్లితోపాటు కూతురు కూడా కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తుందని సభ్యులు చెప్పడంతో ఒక్కసారిగా అందరి ముఖాలలో నవ్వులు చిందాయి.


