ఓటర్లూ.. ఇవి తెలుసుకోండి
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో అందరి దృష్టి ప్రస్తుతం మహబూబ్‌నగర్‌పైనే ఉంది. ఐదు జిల్లాల్లో ఒకే ఒక్క కార్పొరేషన్ ఉండటం.. మొదటిసారి ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మేయర్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో ఆ కుర్చీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ.. మేయర్ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించకపోయిన ఎవరికి వారే మేము రేస్‌లో ఉన్నామని తమకే అవకాశం ఉంటుందని పార్టీ సైతం హామీ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో అధికార పార్టీలో మేయర్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది.
ఆ నలుగురు పేర్లు జోరుగా ప్రచారం
మేయర్ పదవి రిజర్వేషన్ ఖరారయ్యే ముందు వరకు ఒకే వ్యక్తి పేరు జోరుగా వినిపించింది. రెండు నెలల ముందు నుంచి ఆ నేత పేరు వినపడగా.. తీరా మేయర్ పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో పోటీ మరింత తీవ్రమైంది. ఎన్నికల ముందు వరకు ఒక్కరే ప్రచారంలో ఉండగా ప్రస్తుతం మరి కొంతమంది మేయర్ సీటులో కూర్చోవడానికి తమ వంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 49వ డివిజన్ ప్రసన్న ఆనంద్‌కుమార్‌గౌడ్, 37వ డివిజన్ ఎన్.పీ నేహాశ్రీ, 52వ డివిజన్ నుంచి బురుజు కల్పన, 41వ డివిజన్ నుంచి కె.స్వప్న మేయర్ పోటీలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. తొలి కార్పొరేషన్ ఎన్నికలు కావడం వల్ల మొదటి పీఠం ఎవరు అధిరోహిస్తారు అనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఇటూ ఎమ్మెల్యేతో పాటు పార్టీ కీలక నేతలు సైతం కుర్చీలో ఎవరిని కూర్చొపెట్టాలనే విషయంపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. మేయర్ పదవి రేసులో ఉన్న ప్రతి డివిజన్‌లో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంది. ఎక్కడా వెనకడుగు వేయకుండా భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నారు.
అధికార
పార్టీలో
పోటీ తీవ్రం
తొలి మేయర్ పీఠం
ఎవరికో..!
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఓటరు జాబితాలు సిద్ధం చేశారు. పోలింగ్‌కు ముందు ఓటర్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఓటరు జాబితాలో పేరు ఉందా అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలి. లేదా స్థానికంగా ఓటరు నమోదు కేంద్రంలో పరిశీలించుకోవచ్చు.
ఓటరు గుర్తింపు కార్డు, ఇతర ఫోటో గుర్తింపు కార్డు, ఓటరు చీటి మీ వద్ద ఉంచుకోవాలి.
మీ ఇంటి వద్దకే బూత్‌స్థాయి అధికారులు వచ్చి ఓటరు చీటి ఇచ్చి వెళ్తారు. ఒకవేళ ఓటరు చీటి ఇవ్వకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉండే రాజకీయ పార్టీల ఏజెంట్ల వద్ద పొందవచ్చు.
పోలింగ్ కేంద్రం వద్ద మీ ఓటరు చీటి, గుర్తింపు కార్డులను చూపించాలి. ఓ పోలింగ్ అధికారి ఓటరు జాబితాలో గుర్తింపుకార్డుతో పాటు మీ పేరును పరిశీలిస్తారు. మరో అధికారి మీ వేలికి ఇంక్ అంటిస్తారు. ఆ తర్వాత ఒక చీటి ఇస్తారు.
మూడో అధికారి ఆ చీటిని పరిశీలిస్తారు.
ఆ తర్వాత ప్రధాన అధికారి బ్యాలెట్ పేపరు ఇచ్చి దానిని ఎలా మడిచి బ్యాలెట్ బాక్సులో వేయాలన్న విషయాన్ని వివరిస్తాడు.
బ్యాలెట్ పేపరును తీసుకొని ఓటింగగ్ రూంలోకి వెళ్లి అక్కడే ఏర్పాటు చేసిన స్వస్తిక్ గుర్తు స్టాంపుతో మీరు ఓటు ఎవ్వరికి వేయాలనుకున్నారో దానిపై ఆ గుర్తును వేయాలి.
అనంతరం బ్యాలెట్ పేపర్‌ను నిలువుగగా మడిచిన తర్వాత అడ్డంగా మడిచి అక్కడే ఉన్న బ్యాలెట్ బాక్సులో వేసి ఓటరు బయటకు రావాలి.
ఓటర్లూ.. ఇవి తెలుసుకోండి


