ఇల్లు దగ్ధం.. కాలిబూడిదైన నగదు, నగలు, సామగ్రి
ఆత్మకూర్: పట్టణంలోని డీకే రవి కాంప్లెక్స్‌లో ఉన్న ఓ ఇంట్లో బుధవారం వంట గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగి నగదు, నగలు, సామగ్రి కాలిబూడిదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. బిజ్జారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్ కుటుంబం 12 ఏళ్లుగా పట్టణంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వంట చేస్తుండగా సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలతో సహ ఏడుగురు బయటకు పరుగులు తీశారు. మంటల్లో దుస్తులు, సామగ్రితో పాటు బీరువాలోని నగదు, నగలు కాలి బూడిదయ్యాయి. గుర్తించిన చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని సామగ్రి బూడిదయ్యాయని కుటుంబ సభ్యులు రోధించారు, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


