అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

Feb 16 2026 8:35 AM | Updated on Feb 16 2026 8:35 AM

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

తిమ్మాజిపేట: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బుద్దసముద్రం గ్రామ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రాసుమల్ల మేఘన(16) ఈ నెల 14 రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయాక 10:30 గంటల సమయంలో ఇంటి నుంచి నరేష్‌ అనే యువకుడి బైక్‌పై వెళ్లింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గ్రామ సమీపంలో విగత జీవిగా పడి ఉండగా గ్రామస్తులు బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిపై మృతురాలి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు మేఘన జడ్చర్ల కళశాలలో ఇంటర్‌ చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement