రైల్వే స్టేషన్లు తనిఖీ చేసిన జీఎం
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు రైల్వే స్టేషన్లను మంగళవారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ తనిఖీ చేశారు. డోన్– సికింద్రబాద్ సెక్షన్ తనిఖీలో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎస్‌బీబీ జోగులాంబ, గద్వాల, మహబూబ్‌నగర్, జడ్చర్ల రైల్వే స్టేషన్లను పరిశీలించారు. ఎస్‌బీబీ జోగులాంబ అమృత్ స్టేషన్‌లోని ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, గద్వాల స్టేషన్‌లో చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. పనులను మరింత వేగవంతంగా చేయాలని అధికారులకు సూచించారు. కృష్ణ వంతెన వద్ద భద్రతా తనిఖీని నిర్వహించి ట్రాక్‌మెన్లతో సంభాషించారు. ఆరేపల్లి వద్ద లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 96–ఈను తనిఖీ చేశారు. మహబూబ్‌నగర్ అమృత్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన పనులను తనిఖీ చేసి, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు, అదే విధంగా జడ్చర్ల రైల్వే స్టేషన్‌లో పనుల పురోగతిపై సమీక్షించారు. సిగ్నల్, టెలికాం సిబ్బంది స్టేషన్‌లో ప్రదర్శించిన సిగ్నలింగ్ పరికరాల గురించి ఆరా తీశారు. ఆయన వెంట హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్‌కుమార్ వర్మ తదితర అధికారులు ఉన్నారు.
ఏబీఎస్‌ఎస్ పనుల పరిశీలన


